పడ్‌నా లిఖ్‌నా అభియాన్ ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడ్‌నా లిఖ్‌నా అభియాన్(అక్షరాస్యత కార్యక్రమం) ప్రారంభమైంది.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ భవనంలో ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘చదువుకుందాం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌లో భాగంగా చదువు వయసు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో చదవడం, రాయడం నేర్పుతామని మంత్రి చెప్పారు. చదువు లేని 15 ఏళ్ల వయసు దాటిన వారిని బడికి తీసుకొస్తామన్నారు.
శ్రీశైలంలో చిత్రలిపి శాసనాలు
కర్నూలు జిల్లా శ్రీశైలంలో పురాతన చిత్రలిపి ఉన్న శాసనాలు వెలుగుచూశాయి. శ్రీశైల దేవస్థానం పరిధిలో రుద్రాక్ష మఠం, విబూది మఠం సమీపాన బండ పరుపుపై ఉన్న ఈ శాసనాలు క్రీస్తుపూర్వం 1500 నుంచి 300 సంవత్సరాల్లోపు వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.
జీఎస్‌ఎన్ శాస్త్రికి ‘బుర్రా’ పురస్కారం
గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏప్రిల్ 7న కళల కాణాచి సంస్థ ఆధ్వర్యంలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రఖ్యాత నటుడు జీఎస్‌ఎన్ శాస్త్రికి ప్రదానం చేశారు. సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లు రూ.25 వేల నగదు, జ్ఞాపిక, గజమాలతో శాస్త్రి దంపతులను సత్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పడ్‌నా లిఖ్‌నా అభియాన్(అక్షరాస్యత కార్యక్రమం) ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఎక్కడ : ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా
ఎందుకు : చదువు వయసు 15 ఏళ్లు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో చదవడం, రాయడం నేర్పేందుకు

Published date : 09 Apr 2021 11:56AM