Skip to main content

పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి ఇకలేరు

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ (92) ఇకలేరు.
Current Affairs
వయో సంబంధిత సమస్యలతో నవంబర్ 2న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1928 అక్టోబర్ 6న కేరళలోని త్రిపునిథురలో జన్మించిన కృష్ణన్ తన తండ్రి నారాయణ అయ్యర్ వద్ద సంగీత మెలుకువలు నేర్చుకున్నారు. శాస్త్రీయ సంగీతంలో ప్రఖ్యాతిగాంచిన సెమ్మన్‌గుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద శిక్షణపొందారు. తన 11వ ఏటనే ప్రదర్శన ఇచ్చిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్‌లో మ్యూజిక్ టీచర్‌గా కూడా పని చేశారు. కృష్ణన్ ప్రతిభను మెచ్చిన భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో ఆయనను సత్కరించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : టీఎన్ కృష్ణన్ (92)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వయో సంబంధిత సమస్యలతో
Published date : 04 Nov 2020 05:55PM

Photo Stories