Skip to main content

NeoBolt Wheelchair: మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్‌ వెహికల్‌ను తయారు చేసిన ఐఐటీ?

దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్‌ వెహికల్‌ను ఐఐటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీ) మద్రాస్‌ పరిశోధకులు తయారు చేశారు.
‘‘నియోబోల్ట్‌’’ పేరుతో తయారు చేసిన ఈ వాహనం రోడ్లపైనే కాదు, ఇతర అననుకూల ప్రాంతాల్లోనూ ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం... నియోబోల్ట్‌లో వాడే లిథియం– అయాన్‌ బేటరీని ఒక్కసారి ఛార్జి చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. వీల్‌చైర్‌ వాడే వారికి ఇది ఎంతో సౌకర్యం, సురక్షితం. ఆటో, స్కూటర్, కారు కంటే దీనికయ్యే ఖర్చు తక్కువ.
నియో మోషన్తో కలిసి...
ఐఐటీ మద్రాస్‌(IIT Madras)లోని సెంటర్‌ ఫర్‌ రిహాబిలిటేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ డివైజ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం... ‘నియో మోషన్‌’ అనే స్టార్టప్‌తో కలిసి నియోబోల్ట్‌ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ వీల్‌ చైర్‌ సుమారుగా రూ.55 వేలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దేశంలో ఏటా అమ్ముడయ్యే దాదాపు 3 లక్షల వీల్‌ చైర్లలో 2.5 లక్షల వీల్‌ చైర్లు విదేశాల్లో తయారైనవేనని చెప్పారు.

క్విక్రివ్యూ :
ఏమిటి : మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్‌ వెహికల్‌‘‘నియోబోల్ట్‌’’ను తయారు చేసిన ఐఐటీ?
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ఐఐటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీ) మద్రాస్‌
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వీల్‌చైర్‌ వాడే వారి కోసం...
Published date : 24 Aug 2021 06:10PM

Photo Stories