Skip to main content

నూతన గణాంకాల ప్రకారం తెలంగాణలో లింగనిష్పత్తి?

తెలంగాణ రాష్ట్ర జనాభాలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు.
Current Affairs

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డిసెంబర్ 12న విడుదల చేసిన ‘‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20’’లో ఈ విషయం వెల్లడైంది. 2015-16 సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో వెయ్యి మంది పురుషులకు 1,007 మంది మహిళలు(లింగనిష్పత్తి) ఉండగా... తాజా సర్వే ప్రకారం ఆ సంఖ్య 1,049కి పెరిగింది. అందులో పట్టణాల్లో మహిళలు 1,015 మంది ఉండగా, గ్రామాల్లో 1,070 మంది ఉన్నారు.

లింగ నిష్పత్తి: జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియ చేసేది లింగనిష్పత్తి.

2019-20 కుటుంబ ఆరోగ్య సర్వేలోని అంశాలు...

  • ఐదేళ్ల క్రితం తెలంగాణలో సిజేరియన్ ప్రసవాలు 57.7 శాతం ఉండగా, ఇప్పుడు 60.7 శాతానికి పెరిగాయి.
  • ఆసుపత్రుల్లో పుడుతున్నవారి శాతం ఐదేళ్ల క్రితం 91.5 ఉండగా, ఇప్పుడది 97 శాతానికి పెరిగింది.
  • 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో తల్లులైనవారు, గర్భిణులుగా ఉన్నవారు 5.8 శాతం.. ఇది ఐదేళ్ల క్రితం 10.6 శాతంగా ఉండేది.
  • 15 నుంచి 49 ఏళ్ల మహిళల అక్షరాస్యత 66.6 శాతం. అందులో పట్టణాల్లో అక్షరాస్యత 81 శాతం, గ్రామాల్లో 58.1 శాతం.. ఇక పురుషుల అక్షరాస్యత శాతం 84.8 శాతం.
  • శిశు మరణాల రేటు ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో 27.7 ఉండగా, ఇప్పుడు 26.4కు తగ్గింది. ఐదేళ్ల క్రితం ప్రతీ వెయ్యికి 20 మంది మరణించగా, ఇప్పుడు 16.8కు తగ్గింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : నూతన గణాంకాల ప్రకారం తెలంగాణలో లింగనిష్పత్తి1049
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20
ఎక్కడ : తెలంగాణ
Published date : 14 Dec 2020 05:48PM

Photo Stories