Skip to main content

నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎన్‌వీ రమణ

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
Current Affairsఈమేరకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 27 నుంచే ఈ నియామకం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటి వరకు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలకు నిష్పాక్షికమైన, అర్థవంతమైన న్యాయం అందించే లక్ష్యంగా సమీకృత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 1987లో నల్సాను స్థాపించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా(ఎస్సీఎల్‌ఎస్‌సీ) కూడా ఉన్నారు. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ డిసెంబర్ 6వ తేదీ జామ్‌నగర్ హౌజ్‌లోని నల్సా కార్యాలయం సందర్శించారు.

క్విక్ రివ్వూ:
ఏమిటి: నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎన్‌వీ రమణ నియమాకం
ఎవరు: జస్టిస్ ఎన్‌వీ రమణ
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: న్యూఢిల్లీ
Published date : 07 Dec 2019 05:14PM

Photo Stories