Skip to main content

నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?

నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ త్రిపుర కేడర్‌ అధికారి కొలనుపాక రాజేశ్వరరావు నియమితులయ్యారు.
Current Affairs ప్రస్తుతం నీతి ఆయోగ్‌లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేశ్వరరావును స్పెషల్‌ సెక్రటరీ స్థాయిలో నియమిస్తూ కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్‌ 6న కేబినెట్‌ నియామకాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నల్లగొండ జిల్లాకు చెందిన రాజేశ్వర్‌రావు... సోషల్‌ సైన్స్‌లో డాక్టరేట్, నేషనల్‌ సెక్యూరిటీలో ఎంఫిల్, సైకాలజీ, జర్నలిజంలలో పీజీ చేశారు. నీటిపారుదల రంగ నిపుణుడైన దివంగత విద్యాసాగర్‌రావుకు ఈయన మేనల్లుడు. జాతీయ స్థాయిలో మినరల్‌ పాలసీ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. పీఎం జన ఆరోగ్య యోజన పథకం మార్గదర్శకాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు.

ప్రస్తుతం నీతి ఆయోగ్‌ సీఈవోగా ఎవరు ఉన్నారు?

ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా(నీతి ఆయోగ్‌–NITI Aayog) ఏర్పాటైంది. సాధారణంగా దేశ ప్రధానమంత్రి... నీతి ఆయోగ్‌ చైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుతం నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ రాజీవ్‌ కుమార్, సీఈవోగా అమితాబ్‌ కాంత్‌ ఉన్నారు. అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు నీతి ఆయోగ్‌ పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు.

శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్‌ అందిస్తుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ త్రిపుర కేడర్‌ అధికారి కొలనుపాక రాజేశ్వరరావు
Published date : 07 Apr 2021 06:30PM

Photo Stories