నేషన్స్ కప్‌లో భారత్‌కు డజను పతకాలు
Sakshi Education
అంతర్జాతీయ వేదికపై భారత జూనియర్ మహిళా బాక్సర్లు సత్తా చాటారు.
సెర్బియాలోని వర్బస్‌లో జరిగిన మూడవ నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో 12 పతకాలతో మెరిశారు. వీటిలో నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, నాలుగు కాంస్య పతకాలున్నాయి. మొత్తం 20 దేశాలకు చెందిన 160 మందికి పైగా బాక్సర్లు ఈ బాక్సింగ్ టోర్నీలో పాల్గొన్నారు. 13 మందితో కూడిన భారత జట్టు పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచి రన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన తమన్నాకు ‘ఉత్తమ విదేశీ బాక్సర్’ అవార్డు లభించింది.
ఈ టోర్నిలో తమన్నా (48 కేజీలు), అంబేశొరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు), ప్రియాంక (66 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. అంజు దేవి(50 కేజీలు), సిమ్రన్ వర్మ(52 కేజీలు), మాన్షి దలాల్(75 కేజీలు), తనిష్‌బిర్ కౌర్ సంధు(80 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలతో సంతృప్తి పడ్డారు. అశ్రేయ నాయక్(63 కేజీలు), నేహా(54 కేజీలు), ఖుషి(70 కేజీలు), అల్ఫియా అక్రమ్ ఖాన్ పఠాన్(+ 80 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్యాలు సరిపెట్టుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషన్స్ కప్‌లో భారత్‌కు డజను పతకాలు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎక్కడ : బాస్, సెర్బియా

Published date : 20 Aug 2019 05:03PM