Skip to main content

నైగర్‌లో మారణహోమం

పశ్చిమాఫ్రికా దేశం నైగర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు.
Current Affairsనైగర్-మాలి సరిహద్దుల్లో ఉన్న రెండు గ్రామాలు ‘టోంబాంగౌ, జారౌమ్‌దరే’లలో దాడి చేసి వందమందికిపైగా కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు చోటు చేసుకున్న రెండు గ్రామాలను నైగర్ ప్రధాని జనవరి 4న సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

జనవరి 3న టిల్లాబెరి ప్రాంతంలో తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్ గ్రూప్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్తులు కొట్టి చంపారు. ప్రతీకారంగా సాయుధ ఉగ్రవాదులు రెండు గ్రామాలపై దాడి చేశారు. పొరుగు దేశం నైజీరియాలోని బోకో హరామ్ ఉగ్రవాదులతోపాటు, అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రముఠాలు నైగర్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి.

నైగర్ రాజధాని: నియామె; కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సీఎఫ్‌ఏ ఫ్రాంక్
నైగర్ ప్రస్తుత అధ్యక్షుడు: మహమదౌ ఇస్సౌఫౌ
నైగర్ ప్రస్తుత ప్రధాని: బ్రిగి రాఫిని
Published date : 05 Jan 2021 06:07PM

Photo Stories