నాసా యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులైన భారత సంతతి మహిళ?
Sakshi Education
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా... శాస్త్ర సాంకేతిక రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న భారత సంతతికి చెందిన మహిళ భవ్యా లాల్ నియమితులయ్యారు.

ఈ విషయాన్ని ఫిబ్రవరి 2న అమెరికా ప్రభుత్వం తెలిపింది. భవ్య ఇప్పటివరకు ‘అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీమ్’ సభ్యురాలిగా ఉన్నారు. ఇంజనీరింగ్, అంతరిక్ష విజ్ఞాన రంగాల్లో భవ్యా లాల్ ప్రావీణ్యం ఈమెకు ఈ పదవి దక్కేలా చేసింది. గతంలో భవ్యాలాల్ అనేక ప్రభుత్వ పదవులను నిర్వర్తించారు.
చైనా బెదిరింపులకు పాల్పడుతోంది...
చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందనీ, తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై అమెరికా అధ్యక్షుడు బెడైన్ యంత్రాంగం ఈ మేరకు తొలిసారిగా స్పందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అంతరిక్ష సంస్థ నాసా యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : భారత సంతతికి చెందిన మహిళ భవ్యా లాల్

Published date : 04 Feb 2021 06:11PM