నాదల్‌కు యూఎస్ ఓపెన్ టైటిల్
Sakshi Education
టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వశమైంది.
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 9న జరిగిన ఫైనల్లో నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4 స్కోరుతో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించాడు. తాజా విజయంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 19కి చేరింది. విజేత నాదల్‌కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : రాఫెల్ నాదల్ (స్పెయిన్)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : రాఫెల్ నాదల్ (స్పెయిన్)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 10 Sep 2019 08:19PM