Skip to main content

Municipal Leadership Award: లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపికైన మున్సిపాలిటీ?

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మున్సిపాలిటీకి ‘‘మున్సిపాలిటీ లీడర్‌షిప్‌ అవార్డు’’ లభించింది.
ఈ విషయాన్ని సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి ఆగస్టు 30న తెలిపారు. వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకుగాను సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ జాతీయ పురస్కారం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నెట్‌వర్క్‌ కలిగి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎర్త్‌ డే ఆర్గనైజేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ లీడర్‌షిప్‌ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క సిద్దిపేటకే ఈ అవార్డు రావడం విశేషం. సిద్దిపేటతో పాటు కోయంబత్తూరు, భువనేశ్వర్, చండీగఢ్, వాడి, జమ్మూ, రాజ్‌కోట్, బెంగళూరు తదితర పట్టణాలకు సైతం ఈ పురస్కారం లభించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : మున్సిపాలిటీ లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపికైన మున్సిపాలిటీ?
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : సిద్దిపేట మున్సిపాలిటీ
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకుగాను...
Published date : 31 Aug 2021 06:12PM

Photo Stories