Skip to main content

ముస్తాక్ అలీ ట్రోఫీ కర్ణాటక సొంతం

ఇండోర్: ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర, కర్ణాటక జట్లు ఫైనల్ దాకా అజేయమైన ఫలితాల్ని సాధించాయి.
చివరకు ఫైనల్ ముగిసేదాకా అజేయంగా నిలిచింది మాత్రం కర్ణాటక. సమవుజ్జీల మధ్య జరిగిన అంతిమ సమరంలో కర్ణాటక జయభేరి మోగించి టి20 జాతీయ చాంపియన్ గా నిలిచింది.

మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 85 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో కర్ణాటకకు ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. మార్చి 14న జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రపై ఘనవిజయం సాధించింది. మొదట మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. నౌషాద్ షేక్ (41 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. కర్ణాటక బౌలర్ మిథున్ (2/24) మెరుగ్గా బౌలింగ్ చేశాడు. తర్వాత కర్ణాటక 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. రోహన్ కదమ్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. మయాంక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక విజయకేతనం
ఎప్పుడు : మార్చి 14
ఎక్కడ : ఇండోర్
Published date : 15 Mar 2019 06:13PM

Photo Stories