Skip to main content

మూసీ నదిలో డ్రగ్ రెసిస్టెన్స్ పై పరిశోధన

కృష్ణా నది ఉపనది అయిన మూసీ నదిలోని ‘డ్రగ్‌ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన సాగనుంది. మందుల ఉత్పత్తి తర్వాత ఆయా కంపెనీల నుంచి విడుదలైన ‘యాంటీ బయాటిక్స్‌’వ్యర్థాల గాఢత మూసీలో అత్యధికస్థాయిలో ఉన్నట్టు ఇప్పటికే బయటపడింది.
Edu news

ఈ నేపథ్యంలో వీటిస్థాయి అధికస్థాయిలో ఉన్న మూసీతోపాటు తక్కువస్థాయిలో ఉన్న చెన్నైలోని అడయార్‌ నదిపైనా ఈ పరిశోధన జరగనుంది. ఇండో–యూకే ప్రాజెక్ట్‌లో భాగంగా బ్రిటన్ బర్మింగ్ హామ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ అధ్యయనంలో ఐఐటీ–హైదరాబాద్‌ కూడా భాగస్వామి కానుంది.

1.2 మిలియన్ పౌండ్‌లు...
ఈ కొత్త పరిశోధక ప్రాజెక్ట్‌ కోసం ఇండియా, యూకే కలిసి 1.2 మిలియన్ పౌండ్‌ స్టెర్లింగ్‌లు కేటాయించాయి. బ్రిటన్–ఇండియా ప్రభుత్వాల సహకారంతో 8 మిలియన్ల పౌండ్‌ స్టెర్లింగ్‌ల ఖర్చులో నిర్వహిస్తున్న యాంటీ–మైక్రోబియల్‌ రెసిస్టెన్స్(ఏఎంఆర్‌) సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. తల్లుల నుంచి సోకే ‘సూపర్‌ బగ్‌ ఇన్ఫెక్షన్ల’తో భారత్‌లో ప్రతియేటా 58 వేల చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు, యూరప్‌ యూనియన్ లో ప్రతి ఏడాది 28–38 వేల మధ్యలో ‘డ్రగ్‌ రెసిస్టెన్స్ పాథోజెన్ల’తో మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా.

క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రగ్‌ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాపై పరిశోధన
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : బ్రిటన్ బర్మింగ్ హామ్‌ యూనివర్సిటీ, ఐఐటీ–హైదరాబాద్‌
ఎక్కడ : మూసీ నది, అడయార్‌ నది

Published date : 09 Aug 2020 01:18PM

Photo Stories