మరోసారి రామాయణ్ ధారావాహిక ప్రసారం
Sakshi Education
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జీవితగాథ ఆధారంగా తీసిన రామాయణ్ ధారావాహిక మరోసారి ప్రసారం కానుంది.
ఈ సీరియల్‌ను 2020, మార్చి 28వ తేదీ నుంచి దూరదర్శన్ డీడీ నేషనల్ చానెల్‌లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మార్చి 27న వెల్లడించారు. దేశమంతా కరోనా లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే మహాభారత్ ధారావాహికను కూడా ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో రామాయణ్ ప్రసారమైంది.
Published date : 28 Mar 2020 06:53PM