మోటార్ వాహనాల బిల్లుకు కేబినెట్ ఆమోదం
Sakshi Education
మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019తో పాటు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ బిల్లు-2019కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019 ఆమోదం
ఎప్పుడు : 24
ఎవరు : కేంద్ర కేబినెట్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డీఎన్‌ఏ బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్‌ఏ బ్యాంకు, ప్రాంతీయ డీఎన్‌ఏ బ్యాంకులను ఏర్పాటుచేస్తుంది. ఈ బ్యాంకుల్లో నేరం జరిగిన ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదృశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే డీఎన్‌ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు.
మరోవైపు వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019ను రూపొందించారు.
ఈ బిల్లులోని అంశాలు..
మరోవైపు వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019ను రూపొందించారు.
ఈ బిల్లులోని అంశాలు..
- అంబులెన్స్, ఇతర అత్యవసర సేవల వాహనాలను దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకూ జరిమానా విధింపు
- డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా
- డ్రైవింగ్ లెసైన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరినామా
- రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా
- ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 కట్టాలి.
- వాహనాల్లో సీటు బెల్టు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించడంతో పాటు 3 నెలలు డ్రైవింగ్ లెసైన్స్ రద్దు
- మైనర్ పిల్లలు రోడ్డు ప్రమాదానికి కారకులైతే వారి తల్లిదండ్రులు/ సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. సదరు తల్లిదండ్రులు/ సంరక్షకులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించవచ్చు. ఇలాగే ప్రమాదానికి కారణమైన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తారు
- ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు విధిస్తున్న రూ.100 జరిమానాను ఈ బిల్లులో రూ.500కు పెంపు
- అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి రూ.5,000, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా
- ఓవర్ లోడింగ్ వాహనాలపై రూ.20 వేల పెనాల్టీవిధింపు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019 ఆమోదం
ఎప్పుడు : 24
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 25 Jun 2019 05:52PM