Skip to main content

మోదీకి బహ్రెయిన్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహ్రెయిన్ అత్యున్నత పురస్కారం ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్‌‌స’ను బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రదానం చేశారు.
బహ్రెయిన్ మనామాలో ఆగస్టు 25న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుతో మోదీని సత్కరించారు. అనంతరం ద్వెపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై మోదీ, ఖలీఫా చర్చించారు. ఉగ్రవాదంపై నిఘా సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

బహ్రెయిన్ ప్రధానితో మోదీ భేటీ
బహ
్రెయిన్ ప్రధానమంత్రి ప్రిన్‌‌స ఖలీఫా బిన్ సల్మాన్‌తో ఆగస్టు 24న మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్‌‌స ఏజెన్సీ పరస్పర సహకారం వీటిలో ఒకటి.

మోదీ బహ్రెయిన్ పర్యటన విశేషాలు
  • రెండు రోజులపాటు (ఆగస్టు 24, 25 తేదీల్లో) మోదీ బహ్రెయిన్‌లో పర్యటించారు.
  • ఈ పర్యటనతో బహ్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు.
  • మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను ఆగస్టు 25న విడుదల చేసి బహ్రెయిన్ మానవత్వాన్ని చాటుకుంది.
  • బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్‌జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన పనులను మోదీ ఆగస్టు 25న ప్రారంభించారు. అలాగే రూపే కార్డును ప్రారంభించారు.
  • బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశించి మోదీ బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో ఆగస్టు 25న ప్రసంగించారు.
  • బహ్రెయిన్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేసిన కృషిపై అభినందనలను వింటే తన మనసు సంతోషంతో పొంగిపోతుందని మోదీ అన్నారు.
  • బహ్రెయిన్ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలు కాగా, అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్యే 3.5 లక్షలు.
క్విక్ రివ్యూ :
 ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్ ప్రదానం
 ఎప్పుడు  : ఆగస్టు 25
 ఎవరు  : బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా
 ఎక్కడ  : మనామా, బహ్రెయిన్
Published date : 26 Aug 2019 06:18PM

Photo Stories