Skip to main content

మలబార్ విన్యాసాల్లో తొలిసారి పాల్గొన్న ద్వీప దేశం?

మలబార్ తొలి దశ యుద్ధ విన్యాసాలు-2020 నవంబర్ 3న బంగాళాఖాతంలో ప్రారంభమయ్యాయి.
Current Affairs
నవంబర్ 6 వరకు జరగనున్న ఈ నావికాదళ విన్యాసాల్లో భారత నౌకాదళంతో పాటు యునెటైడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తోపాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్‌ఏఎన్) నౌకాదళం పాల్గొన్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో తొలిసారిగా ‘నాన్ కాంటాక్ట్-ఎట్ సీ’ పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు. విన్యాసాల్లో పాల్గొనేందుకు నాలుగు దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల ఉత్తర సముద్ర తీరానికి చేరుకున్నాయి.

రణ్‌విజయ్...
ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్‌మెరైన్లు భారత్ తరఫున ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. యునెటైడ్ స్టేట్స్ నేవీకి చెందిన యూఎస్‌ఎస్ జాన్ మెక్‌కైన్, హెచ్‌ఎంఏఎస్ బలారత్, జపాన్‌కు చెందిన జేఎస్ ఒనామీతో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు తొలి రోజు విన్యాసాల్లో కనువిందు చేశాయి.

అరేబియాలో రెండో దశ...
నవంబర్ 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ మలబార్ రెండో దశ విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహించనున్నారు. మలబార్ ఎక్సర్‌సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది.

1992లో ప్రారంభం...
ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో మలబార్ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాలను భారత్-అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992లో ప్రారంభించాయి. 2015లో జపాన్ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. తాజాగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో.. ఈ సంఖ్య నాలుగుకు చేరింది. 2019, సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ జపాన్ తీరంలో మలబార్ విన్యాసాలు నిర్వహించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మలబార్ విన్యాసాల్లో తొలిసారి పాల్గొన్న ద్వీప దేశం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ఆస్ట్రేలియా
ఎక్కడ : బంగాళాఖాతం
ఎందుకు : ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో
Published date : 04 Nov 2020 05:50PM

Photo Stories