మియామీ టెన్నిస్ టోర్నీవిజేతగా ఆష్లీ బార్టీ
Sakshi Education
మియామీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ బార్టీ నిలిచింది.
అమెరికాలోని మియామీలో మార్చి 31 జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 7-6(7/1), 6-3తో ఐదో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్)ను ఓడించింది. దీంతో బార్టీ తన కెరీర్‌లో తొలి ఏటీపీ మాస్టర్స్-1000 సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నట్లయింది. 15 ఏళ్ల వయసులో జూనియర్ వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ.. ఆ తర్వాత టెన్నిస్‌ను వదిలేసి క్రికెట్‌కు మారింది. అయితే రెండేళ్ల కిందట తిరిగి టెన్నిస్‌లోకి ప్రవేశించిన బార్టీ 2018లో యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మియామీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ విజేత
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : ఆష్లీ బార్టీ
ఎక్కడ : మియామీ, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : మియామీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ విజేత
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : ఆష్లీ బార్టీ
ఎక్కడ : మియామీ, అమెరికా
Published date : 01 Apr 2019 05:22PM