మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్
Sakshi Education
మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు రూపొందించిన ‘ఈ–రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
రాఖీ పండుగను పురస్కరించుకుని ఆగస్టు 3న సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ–రక్షాబంధన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చినప్రభుత్వంలేదని అన్నారు.
మరో కార్యక్రమం...
- - 4s4u.ap.police.gov.in అనే పోర్టల్‌ను కూడా సీఎం ప్రారంభించారు.
- - రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్ చానల్లో వివిధ నిపుణులతో మహిళలకు అవగాహన కల్పిస్తారు.
- - స్మార్ట్‌ఫోన్ వల్ల మంచి ఏంటి? చెడు ఏంటి? నష్టాలేంటి? వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు.
- - సైబర్, వైట్‌కాలర్ నేరాలు.. తదితర అంశాలనూ వివరిస్తారు.
- - ఏయే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఏ యాప్‌లవల్ల ఇబ్బందులు వస్తాయన్న వాటి గురించి కూడా చెబుతారు.
- - నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలో తెలియజేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ–రక్షాబంధన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు :మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు
Published date : 05 Aug 2020 01:45PM