మహిళల క్రికెట్ చీఫ్ సెలక్టర్గా వ్యవహరించనున్న భారత మాజీ క్రికెటర్?
Sakshi Education
భారత మహిళల క్రికెట్ కార్యకలాపాల్లో కదలిక మొదలైంది. యూఏఈ వేదికగా మూడు జట్లతో మహిళల చాలెంజర్ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళల క్రికెట్ జట్టుకు నూతన సెలక్షన్ కమిటీని నియమించింది.
ఈ కమిటీకి 90వ దశకంలో విశేషంగా రాణించిన భారత మాజీ క్రికెటర్, మేటి లెఫ్టార్మ్ స్పిన్నర్ నీతూ డేవిడ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా సెప్టెంబర్ 26న ప్రకటించారు. మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నీతూతో పాటు మిథు ముఖర్జీ, రేణు మార్గరెట్, ఆరతి వైద్య, వెంకటాచెర్ కల్పన ఇతర సభ్యులు. హేమలత కళ ఆధ్వర్యంలోని గత సెలక్షన్ కమిటీ నాలుగేళ్ల పదవీకాలం 2020, మార్చితో ముగిసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల క్రికెట్ చీఫ్ సెలక్టర్గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : భారత మాజీ క్రికెటర్, మేటి లెఫ్టార్మ్ స్పిన్నర్ నీతూ డేవిడ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల క్రికెట్ చీఫ్ సెలక్టర్గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : భారత మాజీ క్రికెటర్, మేటి లెఫ్టార్మ్ స్పిన్నర్ నీతూ డేవిడ్
Published date : 29 Sep 2020 01:26PM