మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా ఏ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది?
దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణకి చెందిన ‘వీ హబ్’, గుజరాత్‌కు చెందిన ‘ఐ హబ్’ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. జనవరి 16న వర్చువల్ విధానంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు, గుజరాత్ విద్యా శాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడాసమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి విభావరి బెన్ దవే పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 240 స్టార్టప్‌లకు అన్ని విధాల చేయూత అందిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వీ హబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్-WE HUB) కార్యక్రమం 2018, మార్చి 8న ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణకి చెందిన ‘వీ హబ్’, గుజరాత్‌కు చెందిన ‘ఐ హబ్’ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం
ఎప్పుడు : జనవరి 16
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా