Skip to main content

మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం

మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో భారీ పోర్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Current Affairsప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 5న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)కి 97 కిలోమీటర్ల దూరంలోని వధావన్ వద్ద ఈ భారీ పోర్టు నిర్మాణం చేపడతారు. ప్రైవేటు భాగస్వామ్యంతో (ల్యాండ్ లార్డ్ మోడల్‌లో) అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.65,544.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

కేంద్ర కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
  • ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ద్వారా భారత్-శ్రీలంకల మధ్య విమాన సర్వీసులు నడపడానికి ఆమోదం.
  • సూరత్, భోపాల్, భాగల్పుర్, అగర్తల, రాయచూర్ ట్రిపుల్ ఐటీ (పీపీపీ)లకు జాతీయ ప్రాధాన్య సంస్థల హోదా కల్పించాలని నిర్ణయం.
  • పీఎంసీ బ్యాంక్ తరహా సంక్షోభం మరోసారి తలెత్తకుండా డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ, సహకార బ్యాంకులను మరింత పటిష్టం చేసే దిశగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణకు ఆమోదం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : వధావన్, మహారాష్ట్ర
Published date : 06 Feb 2020 06:05PM

Photo Stories