మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం
Sakshi Education
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత దేవేంద్ర గంగాధర్రావు ఫడ్నవీస్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఫడ్నవిస్‌తోపాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో నవంబర్ 23న జరిగిన కార్యక్రమంలో ఫడ్నవిస్, అజిత్ పవార్‌తో మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. అనంతరం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్ తెలిపారు.
ఫడ్నవీస్ నేపథ్యం
బీజేపీ నేత, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో 1970 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చదివారు.
1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించిన ఫడ్నవీస్ 1992, 1997లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి నెగ్గారు. 2014లో మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
(చదవండి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల)
(చదవండి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా)
(చదవండి :రాష్ట్రపతి పాలన ఏఏ సందర్భాల్లో విధిస్తారు)
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగాప్రమాణ స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : దేవేంద్ర గంగాధర్రావు ఫడ్నవీస్
ఎక్కడ : రాజ్‌భవన్, ముంబై, మహారాష్ట్ర

Published date : 23 Nov 2019 11:38AM