Skip to main content

మౌషిక్ పేరుతో మైక్రోప్రాసెసర్‌ను రూపొందించిన ఐఐటీ?

ఐఐటీ మద్రాస్ పరిశోధకులు ‘మౌషిక్’ పేరుతో మైక్రోప్రాసెసర్‌ను అభివృద్ధి చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ప్రాసెసర్‌ను క్రెడిట్, డెబిట్ కార్డుల్లో, ఈవీఎంలలో, ఆఫీస్ మేనేజ్‌మెంట్ వ్యవస్థల్లో వినియోగించుకోవవచ్చు.
Current Affairs
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చింది. ఈ ప్రాసెసర్ కాన్సెప్ట్, డిజైన్, అభివృద్ధి పనుల్లో ప్రతాప్ సుబ్రమణ్యం సెంటర్ ఫర్ డిజిటల్ ఇంటెలిజెన్స్, ‘రైస్’ గ్రూప్‌కు చెందిన సెక్యూర్ హార్డ్‌వేర్ ఆర్కిటెక్చర్, ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలు పాలుపంచుకున్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మౌషిక్ పేరుతో మైక్రోప్రాసెసర్ రూపకల్పన
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : ఐఐటీ మద్రాస్
ఎందుకు : క్రెడిట్, డెబిట్ కార్డుల్లో, ఈవీఎంలలో, ఆఫీస్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలో ఉపయోగించేందుకు
Published date : 25 Sep 2020 05:29PM

Photo Stories