మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‌గా నియమితులైన భారత సంతతి వ్యక్తి?
Sakshi Education
భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు సత్య నాదెళ్ల మరోఘనతను సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు.
ప్రస్తుత చైర్మన్ జాన్ తాంసన్ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త కంపెనీ ఎంపిక చేసింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కాగా సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తరువాత చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తాంసన్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు జూన్ 16న కంపెనీ తెలిపింది. స్టీవ్ బాల్‌మెర్ నుండి 2014 లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల, లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్ , జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అనేక డీల్స్‌తో మైక్రోసాఫ్ట్ వృద్దిలో కీలకపాత్ర పోషించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‌గా నియమితులైన భారత సంతతి వ్యక్తి?
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు సత్య నాదెళ్ల
ఎక్కడ : అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : మైక్రోసాఫ్ట్ నూతన చైర్మన్‌గా నియమితులైన భారత సంతతి వ్యక్తి?
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు సత్య నాదెళ్ల
ఎక్కడ : అమెరికా
Published date : 17 Jun 2021 11:09AM