Skip to main content

మానసిక రుగ్మతలుంటే మరణ శిక్ష వద్దు

మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయితే వారిని ఉరి తీయకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి, హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడగా, ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈమేరకు తీర్పు చెప్పింది. జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని జస్టిస్ శంతనగౌండర్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 18న ఈ తీర్పును వెలువరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 19 Apr 2019 05:35PM

Photo Stories