లండన్ ఓపెన్ చెస్ టోర్నీ విజేతగా ప్రజ్ఞానంద
Sakshi Education
ప్రతిష్టాత్మక లండన్ క్లాసిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అండర్-14 కేటగిరీలో భారత్‌కి చెందిన ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు.
ఈ టోర్నిలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద, ఆంటోన్ స్మిర్నోవ్ (ఆస్ట్రేలియా) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా ప్రజ్ఞానందకు మొదటి ర్యాంక్ ఖాయమైంది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం 7 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. ప్రజ్ఞానంద ఇప్పటికే 2019 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ అండర్-18 విభాగంలో విజేతగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లండన్ క్లాసిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అండర్-14 కేటగిరీ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ప్రజ్ఞానంద
క్విక్ రివ్యూ :
ఏమిటి : లండన్ క్లాసిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అండర్-14 కేటగిరీ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ప్రజ్ఞానంద
Published date : 09 Dec 2019 06:02PM