లిథువేనియా బ్యాడ్మింటన్ టోర్నిలో విజేత నిలిచిన భారత క్రీడాకారిణి?
Sakshi Education
లిథువేనియా ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ యువతార మాళవిక బన్సోద్ విజేతగా నిలిచింది.
లిథువేనియాలోని కౌనాస్‌లో జూన్ 13న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల మాళవిక 21–14, 21–11తో నాలుగో సీడ్ రేచల్ దారగ్ (ఐర్లాండ్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన మాళవిక తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లిథువేనియా బ్యాడ్మింటన్ టోర్నిలో విజేత నిలిచిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : మాళవిక బన్సోద్
ఎక్కడ : కౌనాస్, లిథువేనియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : లిథువేనియా బ్యాడ్మింటన్ టోర్నిలో విజేత నిలిచిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : మాళవిక బన్సోద్
ఎక్కడ : కౌనాస్, లిథువేనియా
Published date : 15 Jun 2021 08:18PM