Skip to main content

లాక్‌డౌన్‌తో రూ.17 లక్షల కోట్లు నష్టం: బార్‌క్లేస్‌

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 234.4 బిలియన్‌ డాలర్లు (డాలర్‌ మారకంలో రూపాయి విలువలో దాదాపు రూ.17,60,000 కోట్లు) నష్టపోతుందని బ్రిటిష్‌ బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌ అంచనావేసింది.
Current Affairs
తొలి మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 120 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.9,00,000 కోట్లు) నష్టం జరుగుతుందని తొలుత బార్‌క్లేస్‌ అంచనా వేసింది. అయితే తాజాగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు వల్ల ఈ అంచనాలను 234.4 బిలియన్‌ డాలర్లకు పెంచింది. వెరసి 2020 క్యాలెండర్‌ ఇయర్‌లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ‘సున్నా’గా ఉంటుందని పేర్కొంది. అయితే 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధిరేటు స్వల్పంగా 0.8 శాతం ఉంటుందని తన తాజా పరిశోధనా పత్రంలో అభిప్రాయపడింది. తొలి 21 రోజుల లాక్‌డౌన్‌ సందర్భంలో దేశంలో 2020 క్యాలెండర్‌ ఇయర్‌లో 2.5 శాతం వృద్ధి ఉంటుందని అంచనావేసిన బ్రోకరేజ్‌ సంస్థ, 2020–21లో వృద్ధి 3.5 శాతం ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఈ శాతాలను వరుసగా ‘సున్నా’, ‘0.8 శాతాలుగా’ త‌గ్గించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : లాక్‌డౌన్‌తో రూ.17 లక్షల కోట్లు నష్టం
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : బ్రిటిష్‌ బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌
ఎక్కడ : భార‌త్‌
ఎందుకు : లాక్‌డౌన్‌ వల్ల
Published date : 15 Apr 2020 06:49PM

Photo Stories