Skip to main content

ఖతార్‌ విదేశాంగ మంత్రితో ఎస్‌. జైశంకర్‌ చర్చలు

ఖతార్‌ విదేశాంగ మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌–థానీతో ఆగస్టు 20న భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సమావేశమయ్యారు.
ఖతార్‌ రాజధాని దోహాలో జరిగిన ఈ భేటీలో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు, తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. నాలుగు రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని భారత్‌కు తిరుగు ప్రయాణమైన ఆయన ఖతార్‌లో ఆగారు.

తాలిబన్ల ప్రతీకారం
అందరికీ క్షమాభిక్ష పెట్టి శాంతియుత వాతావరణం కల్పిస్తామని చెప్పిన తాలిబన్లు తమ సహజ ధోరణిలో ప్రతీకార చర్యలు ప్రారంభించారు. అమెరికా మద్దతు కలిగిన అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వానికి అండగా ఉన్న వారిని గుర్తించి షరియా చట్టం కింద శిక్షలు విధించడానికి సిద్ధమవుతున్నారు.

భారత ఎంబసీల్లో సోదాలు
అఫ్గాన్‌నిస్తాన్‌లోని కాందహార్, హెరాత్‌లలో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసేసినప్పటికీ ఆగస్టు 19న తాలిబన్లు తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలేమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించారు. కార్యాలయాల్లో నిలిపి ఉంచిన వాహనాలను తమ వెంట తీసుకెళ్లారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఖతార్‌ విదేశాంగ మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌–థానీతో చర్చలు
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌
ఎక్కడ : దోహా, ఖతార్‌
ఎందుకు : అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు, తాజా పరిణామాలపై చర్చించేందుకు...
Published date : 21 Aug 2021 05:59PM

Photo Stories