Skip to main content

కశ్మీర్, లడఖ్‌లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్

కేంద్రపాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూకశ్మీర్‌లలో ‘ఖేలో ఇండియా వింటర్ గేమ్స్-2020’ను నిర్వహించనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఫిబ్రవరి 13న ప్రకటించారు.
Current Affairsక్రీడల నిర్వహణకు కావల్సిన నిధులను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్ స్పోర్‌‌ట్స కౌన్సిల్, వింటర్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ జమ్మూ కశ్మీర్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ క్రీడల్లో 1,700 మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో ఓపెన్ ఐస్ హాకీ చాంపియన్‌షిప్, ఫిగర్ స్కేటింగ్, స్పీడ్ స్కేటింగ్ తదితర క్రీడలను బ్లాక్, జిల్లా, యూటీ స్థాయిల్లో నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలను వయసు ఆధారంగా మొత్తం నాలుగు విభాగాలుగా విభజించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్-2020
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఎక్కడ : లడఖ్, జమ్మూకశ్మీర్
Published date : 14 Feb 2020 05:49PM

Photo Stories