క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత వికెట్ కీపర్?
Sakshi Education
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ నమన్ ఓజా అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఈ మేరకు ఫిబ్రవరి 15న తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 37 ఏళ్ల నమన్ ఓజా భారత్ తరఫున రెండు టి20 మ్యాచ్‌ల్లో (2010లో హరారేలో జింబాబ్వేతో), ఒక వన్డేలో (2010లో హరారేలో శ్రీలంకతో), ఒక టెస్టులో (2015లో కొలంబోలో శ్రీలంకతో) ఆడాడు.
దేశవాళీ క్రికెట్‌లో...
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్‌గా నమన్ ఓజా గుర్తింపు పొందాడు. 351 మంది బ్యాట్స్‌మెన్ అవుట్‌లలో అతను భాగం పంచుకున్నాడు. ఐపీఎల్ టి20 టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ నమన్ ఓజా

Published date : 16 Feb 2021 05:44PM