Skip to main content

కోవిడ్‌పై పోరుకు కేంద్రం చేపట్టిన పజాచైతన్య కార్యక్రమం పేరు?

రాబోయే రోజుల్లో దసరా, దీపావళి సహా పండుగల సీజన్ కావడంతో జనం పెద్ద ఎత్తున ఒకే చోట చేరడం సహా చలికాలం సమీపిస్తున్న వేళ కరోనా వైరస్ మహమ్మారి మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది.
Current Affairs
ఈ నేపథ్యంలో కోవిడ్‌పై పోరాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జన్ ఆందోళన్’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌తో ప్రారంభించారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. ‘యునైట్ 2 ఫైట్ కరోనా’హ్యష్‌టాగ్‌తో ఈ వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి మన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జన్ ఆందోళన్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : కోవిడ్‌పై పోరాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు
Published date : 10 Oct 2020 12:09PM

Photo Stories