Skip to main content

కోవిడ్-19పై పోరుకు 5 ట్రిలియన్ డాలర్లు సాయం

కోవిడ్-19పై ప్రపంచదేశాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జీ-20 దేశాలు 5 ట్రిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి.
Current Affairs
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఈ నిధులను విడుదల చేస్తామని పేర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా రాజు సల్మాన్ అధ్యక్షతన మార్చి 26న జీ-20 దేశాల అత్యవసర వీడియోకాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా జీ-20 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉమ్మడి సంక్షోభంపై ఐక్యంగా పోరాడతామని పేర్కొన్నాయి.

సరైన విధానం రూపొందించాలి: మోదీ
జీ-20 దేశాల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... కోవిడ్ తరహా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన నియమావళి, విధానాల రూపకల్పనపై దృష్టి సారించాలని జీ-20 దేశాలను కోరారు. సమయంలో ఆర్థిక లక్ష్యాలు కాకుండా మానవతా దృక్పథంతో అంతర్జాతీయ సమన్వయం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వంటి సంస్థల సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు కృషి చేయాలన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 5 ట్రిలియన్ డాలర్లు సాయం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : జీ-20 దేశాలు
ఎందుకు : కోవిడ్-19పై పోరుకు
Published date : 27 Mar 2020 06:44PM

Photo Stories