కిరణ్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం
Sakshi Education
బయోకాన్ వ్యవస్థపాపకురాలు,ఎండీ కిరణ్ మజుందార్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ లభించింది.
బెంగళూరులోని లీలా ప్యాలెస్‌లో జనవరి 17న జరిగిన కార్యక్రమంలో భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హరిందర్ సింధు ఈ అవార్డును కిరణ్‌కు అందజేశారు. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపర సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు గాను కిరణ్‌కు ఈ అవార్డు దక్కింది.
ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారాన్ని 1975, ఫిబ్రవరి 14న క్వీన్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో చదివిన కిరణ్ షా ఈ పురస్కారాన్ని స్వీకరించిన భారతీయుల్లో నాల్గవ వారు. కిరణ్ కంటే ముందు భారత్ నుంచి మదర్ థెరిస్సా, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం విజేత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : కిరణ్ మజుందార్-షా
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపర సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు
మాదిరి ప్రశ్నలు

1. మిస్ వరల్డ్-2019 కిరీటాన్ని ఎవరు దక్కించుకున్నారు?
1. సుమన్ రావ్
2. టోని ఆన్-సింగ్
3. జోజిబిని తుంజి
4. కాట్రియానా గ్రే
- View Answer
- సమాధానం : 2
Published date : 20 Jan 2020 05:45PM