కేరళ విద్యార్థికి నిఫా వైరస్
Sakshi Education
కేరళలో ఒక విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు జూన్ 4న కేరళ సర్కార్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మరో 311 మందిని వైద్యుల పరిశీలనలో ఉంచామని కేరళ ఆరోగ్యమంత్రి శైలజ నిర్ధారించారు. విద్యార్థి రక్త నమూనాను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కు పంపించగా వారు నిఫా వైరస్‌గా నిర్ధారించారని ఆమె తెలిపారు. ఆ విద్యార్థి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేదని ఆమె తెలిపారు. ఆస్ట్రేలియాలో తయారైన యాంటీ నిఫా మందును కేరళకు పంపిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చారని శైలజ వెల్లడించారు. 2018లో నిఫా వైరస్ కారణంగా 17 మంది చనిపోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నిఫా వైరస్ సోకిన విద్యార్థి గుర్తింపు
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : కేరళ ప్రభుత్వం
ఎక్కడ : కేరళ
క్విక్ రివ్యూ :
ఏమిటి : నిఫా వైరస్ సోకిన విద్యార్థి గుర్తింపు
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : కేరళ ప్రభుత్వం
ఎక్కడ : కేరళ
Published date : 05 Jun 2019 05:45PM