కేంద్రానికి ఎల్‌ఐసీ రూ.2,611 కోట్ల డివిడెండ్
Sakshi Education
ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్‌ఐసీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2,611 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది.
ఈ మేరకు చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ చైర్మన్ ఎమ్.ఆర్. కుమార్ డిసెంబర్ 27న అందజేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ 10 శాతం వృద్ధితో రూ.53,214 కోట్ల మిగులు విలువను సాధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 1956, సెప్టెంబర్ 1న ఎల్‌ఐసీని స్థాపించారు. ప్రస్తుతం రూ.31.11 లక్షల కోట్ల ఆస్తులను ఎల్‌ఐసీ నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.61 లక్షల కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రానికి రూ.2,611 కోట్ల డివిడెండ్
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్‌ఐసీ
ఎందుకు : 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రానికి రూ.2,611 కోట్ల డివిడెండ్
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్‌ఐసీ
ఎందుకు : 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను
Published date : 28 Dec 2019 06:02PM