కేంద్రానికి 28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్
Sakshi Education
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి) కేంద్రప్రభుత్వానికి రూ. 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ఫిబ్రవరి 18న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది.
క్లుప్తంగా వివరాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రానికి 28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
- ఆర్‌బీఐ జూలై - జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. దీనిప్రకారం 2018 జూలై నుంచి 2019 జూన్ నెలాఖరు వరకూ ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది.
- 2018 ఆగస్టులో (తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరిధిలోనికి వచ్చే) ఆర్‌బీఐ ఒక ప్రకటన చేస్తూ, 2017-18కి సంబంధించి కేంద్రానికి రూ.50,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 40 వేల కోట్లు మిగులు నిధులుకాగా, 10 వేల కోట్లు మధ్యంతర డివిడెండ్.
- ఇక తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018 జూలై-2019 జూన్) సంబంధించి రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఇస్తున్నట్లు తాజాగా ఫిబ్రవరి 18న పేర్కొంది.
- దీనితో కేంద్రానికి సంబంధించినంతవరకూ ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్-2019 మార్చి) ఆర్‌బీఐ నుంచి మొత్తం రూ.78,000 కోట్లు అందినట్లవుతోంది.
- ఇలా మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఆర్‌బీఐ ఇవ్వడం ఇది వరుసగా రెండవ సంవత్సరం. 2017-18లో ప్రభుత్వానికి ఆర్‌బీఐ నుంచి అందిన మొత్తం డివిడెండ్ రూ.30,663 కోట్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రానికి 28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
Published date : 19 Feb 2019 05:47PM