కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం?
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్-కమిషనర్ విజయ్‌కుమార్, కేంబ్రిడ్‌జ విశ్వవిద్యాలయం దక్షిణాసియా రీజనల్ డెరైక్టర్ టీకే అరుణాచలం జనవరి 7న అమరావతిలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా... రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు పులివెందులలో ఇంగ్లిష్ ల్యాబ్‌లు, మరో మూడు కేంద్రాల్లో డిజిటల్ స్టూడియోలను కేంబ్రిడ్జ్ వర్సిటీ నెలకొల్పనుంది.
రహదారుల అభివృద్ధి కోసం ఎన్‌డీబీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి రూ.472 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టుల కోసం... న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)తో కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 6న రుణ ఒప్పందం చేసుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు