జూమ్ సురక్షితమైనది కాదు: కేంద్రం
Sakshi Education
లాక్‌డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న ‘జూమ్’ప్లాట్‌ఫామ్ అంత సురక్షితమైనది కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 16న ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే, జూమ్‌ను వినియోగించే ప్రైవేటు సంస్థ లు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది.
Published date : 17 Apr 2020 06:22PM