Skip to main content

జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఘనత

జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఘనత సాధించారు. ఆ దేశాన్ని సుదీర్ఘకాలం నుంచి పాలించిన నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు.
ప్రధానిగా అబే 2019, నవంబర్ 20 నాటికి 2,887 రోజులు పూర్తిచేసుకున్నారు. గతంలో టారో కస్తురా సుదీర్ఘకాలం(1901-1913 మధ్య) పాలించిన ప్రధానిగా నిలవగా ఆ రికార్డును అబే అధిగమించారు. అబే 2006లో తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు, కుంభకోణాల కారణంగా కేవలం ఏడాదికే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2012లో తిరిగి అధికారంలోకి వచ్చాడు. ఆయన పదవీ కాలం 2021 సెప్టెంబరు వరకు ఉంది.

షింజో అబే తన పాలన కాలంలో మిలటరీ బలోపేతంతో పాటు, అనేక రాజ్యంగ సవరణలు చేశారు. ఉత్తర కొరియా ఆధీనంలోని జపనీయులను విడుదల చేయడం, రష్యాతో దీర్ఘకాల ప్రాదేశిక వివాదం పరిష్కారం, దేశం ఆర్థిక పురోగతికి అనేక సంస్కరణలు చేపట్టడం ఆయన ఖ్యాతిని పెంచింది.
Published date : 21 Nov 2019 06:06PM

Photo Stories