Daily Current Affairs in Telugu: జనవరి 6th, 2023 కరెంట్ అఫైర్స్
Swachh Survekshan Awards: తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల పంట!
జాతీయస్థాయిలో తెలంగాణ సత్తా చాటింది. నాలుగు స్టార్ రేటింగుల్లో తెలంగాణ మొదటి మూడు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్‌ఎస్‌జీ) అవార్డులు సాధించింది. దీనికి సంబంధించి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఈ అవార్డులు లభించాయి. వీటితోపాటు 3 స్టార్, 2 స్టార్ రేటింగ్స్‌లోనూ తెలంగాణ పల్లెలు టాప్ ర్యాంక్‌లలో నిలిచాయి. అచీవర్స్ 3 స్టార్ రేటింగ్‌లో సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలువగా జగిత్యాల జిల్లా రెండోస్థానాన్ని, పెర్ఫార్మర్స్ 2 స్టార్ రేటింగ్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటిస్థానాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని స్వచ్ఛత అంశాలను పరిగణన లోకి తీసుకొని జిల్లాలకు ర్యాంకులను స్టార్ రేటింగ్‌లవారీగా విడుదల చేసింది.
Telangana Farmers: దేశంలో తెలంగాణ రైతుల స్థానం.. అప్పుల్లో 5, ఆదాయంలో 25
Sir Chhotu Ram Award: సీఎం కేసీఆర్‌కు ‘సర్ ఛోటూ రామ్’ అవార్డు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు ‘సర్ ఛోటూ రామ్’అవార్డును ప్రకటించారు. పంజాబ్ రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన సర్ ఛోటూ రామ్ పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 5న ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు అందజేశారు.
ఎవరీ సర్ ఛోటూ రామ్?: స్వాతంత్య్రానికి పూర్వం వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగిపోతున్న పంజాబ్ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సర్ ఛోటూ రామ్ 1934లో పంజాబ్ రిలీఫ్ అప్పుల చట్టం, 1936లో పంజాబ్ రుణదాతల రక్షణచట్టం తేవడానికి కృషి చేశారు. తదనంతర కాలంలో ఈ చట్టాలు పంజాబ్ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయి. ఆ తర్వాత హరితవిప్లవంతో స్వామినాథన్ పంజాబ్ రైతులను గణనీయంగా ప్రభావితం చేశారు. ఆ తర్వాత తమను అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి కేసీఆరేనని పంజాబ్ రైతులు మంత్రితో అన్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డులు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
Water Vision@2047: భోపాల్‌లో తొలి జలవనరుల శాఖ మంత్రుల జాతీయ సదస్సు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల తొలి జాతీయ సదస్సును ఉద్దేశించి జనవరి 5వ తేదీ ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. దేశంలో జల సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వం తీసుకొనే చర్యలే సరిపోవని, ప్రజలందరి భాగసామ్యంతోనే అది సాధ్యమవుతుందని, ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్యానికి నీరు ఒక కీలకాంశం కావాలని చెప్పారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి పంపకాలపై ముందుగానే దృష్టి పెట్టాలని సూచించారు.
‘వాటర్ విజన్–2047’
మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం జలం అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని మోదీ గుర్తుచేశారు. మనం నిర్దేశించుకున్న సమ్మిళిత లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 25 ఏళ్లలో సాగించబోయే ‘అమృతకాల’ ప్రయాణంలో ‘వాటర్ విజన్–2047’ అనేది అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ శాతం పనులు జల సంరక్షణ దిశగానే జరగాలని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. ప్రజలతోపాటు సామాజిక సంస్థలు, పౌర సంస్థలు సైతం జల సంరక్షణ ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని కోరారు.
Free Foodgrains: 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు
ప్రతి జిల్లాలో అమృత సరోవరాలు
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రదాని తెలియజేశారు. ఇప్పటికే 25,000 సరోవరాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి సరోవరం కనీసం ఎకరం వైశాల్యంలో ఉంటుందని, ఇందులో 10,000 క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయొచ్చని అన్నారు. జల సంరక్షణకు జియో–సెన్సింగ్, జియో–మ్యాపింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు వాడుకోవాలని సూచించారు. టెక్నాలజీ–పరిశ్రమలు–స్టార్టప్‌లను అనుసంధాస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. నమామి గంగా మిషన్ తరహాలో నదుల ప్రక్షాళనకు రాష్ట్రాలు సైతం నడుం బిగించాలని ప్రధానమంత్రి విన్నవించారు. ‘ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీమ్’ కింద 70 లక్షల హెక్టార్లకుపైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు.
Unemployment Rate: దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
Intelligent Surgical Knife: కేన్సర్‌ను ‘కత్తి’లా పసిగట్టేస్తుంది..!
బ్రిటన్ శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన ఇంటెలిజెంట్ సర్జికల్ నైఫ్ (ఐనైఫ్) గర్భాశయ కేన్సర్‌ను సెకండ్లలో పసిగట్టేస్తోంది. కేన్సర్ చికిత్సలను త్వరితగతిని అందించి ఎందరో మహిళల ప్రాణాలను కాపాడే అవకాశం ఐనైఫ్ ద్వారా వచ్చిందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో వైద్య నిపుణులు చెప్పారు. సాధారణంగా మహిళల్లో వచ్చే ఎండోమెట్రియల్ కేన్సర్‌ను గుర్తించడం ఆలస్యం అవడం వల్ల దుష్ప్రభావాలు అధికం. అయితే ఈ ఐనైఫ్‌తో సెకండ్లలో కేన్సర్‌ను గుర్తించగలుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. వివరాలను జర్నల్ కేన్సర్స్‌లో ప్రచురించారు. గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు అనుమానం ఉన్న 150 మంది మహిళల టిష్యూ శాంపిల్స్‌ను సర్జికల్ కత్తితో పరీక్షిస్తే సెకండ్లలోనే ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ పద్ధతిలో చేసిన ఫలితాలతో పోల్చి చూస్తే 86% ఫలితాలు సరిగ్గా ఉన్నాయని ఆ అధ్యయనం వివరించింది.
Heart Attacks: అతి వ్యాయామంతో యువతలో గుండెపోటు!
Satya Nadella: డిజిటల్ ఇండియా విజన్‌కు సహకరిస్తాం.. సత్య నాదెళ్ల
‘డిజిటల్ ఇండియా విజన్’ సాకారం కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. జనవరి 5న ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ ఇండియా విజన్ మొత్తం ప్రపంచానికి వెలుగును చూపుతుందని ఉద్ఘాటించారు. దేశ యువత నూతన ఆలోచనలు భూగోళాన్ని ప్రభావితం చేయగలవని మోదీ ట్వీట్‌లో వివరించారు.
డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు
భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని నాదెళ్ల తెలిపారు. తమ దారిలోనే ఇతర కంపెనీలు సైతం నడుస్తాయని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ‘ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సదస్సు’లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. భారతదేశ టెక్నాలజీ స్టోరీ విస్తరించడానికి సహకరిస్తామన్నారు. టెక్నాలజీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు.
H-1B Visa: హెచ్1బీ వీసా ఫీజు పెంపు!
హెచ్–1బీ వీసా దరఖాస్తు సహా అన్ని ఇమిగ్రేషన్ ఫీజుల మోత మోగించేందుకు అమెరికా సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రచురించింది. 460 డాలర్లుగా ఉన్న హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను ఏకంగా 780 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలొస్తున్నాయి. మిగతా ఫీజులూ దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ–1 దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఒక్కసారిగా 229 శాతం పెంపు అన్నమాట. ఎల్–1 ధరను 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచేయనున్నారు. అంటే ఏకంగా 332 శాతం పెరుగుదల. హెచ్–2బీ దరఖాస్తుల ధర 460 డాలర్ల నుంచి ఒకేసారి 1,080 డాలర్లకు చేరుకోనుంది. అయితే, ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని మార్చి ఏడో తేదీలోపు వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్ సేవల ఫీజును రద్దుచేస్తామని ప్రతిపాదించింది. 2016 ఏడాది నుంచి ఇప్పటివరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
వీసా ఎదురుచూపులు తగ్గించేందుకు కృషి
భారత్‌లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు.
Hockey World Cup: గెలిస్తే ఒక్కొక్కరికి రూ.1 కోటి!
మన దేశంలో జరిగే హాకీ ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంటే ఒక్కో ఆటగాడికి రూ.1 కోటి చొప్పున కానుకగా అందజేస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. జనవరి 13 నుంచి 29 వరకు ఒడిషాలోని రెండు నగరాల్లో హాకీ ప్రపంచకప్ జరుగుతుంది. జనవరి 5న రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లోనే అతి పెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని పట్నాయక్ ప్రారంభించారు. దీంతో పాటు భువనేశ్వర్ (కళింగ స్టేడియం) కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ‘ఒడిషా రే’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన అనంతరం భారత ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. తమ రాష్ట్రానికి హాకీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పట్నాయక్.. ఆటగాళ్లకు ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
Sundararaman Ramamurthy: బీఎస్‌ఈ సీఈవోగా సుందరరామన్
స్టాక్ ఎక్ఛ్స్ంజీ దిగ్గజం బీఎస్‌ఈకి ఎండీ, సీఈవోగా సుందరరామన్ రామమూర్తి ఎంపికయ్యారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రామమూర్తి ఎంపికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు బీఎస్‌ఈ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ను రామమూర్తి ఆమోదించవలసి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్‌ఈ గత ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ గతేడాది(2022) జూలైలో పదని నుంచి తప్పుకుని మరో దిగ్గజ స్టాక్ ఎక్ఛ్స్ంజీ ఎన్‌ఎస్‌ఈకి తరలి వెళ్లారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో సభ్యులుగా వ్యవహరించిన రామమూర్తికి బీఎస్‌ఈ అత్యున్నత పదవిని ఆఫర్ చేసింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)