జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏడోసారి చాంపియన్‌గా నిలిచిన జిమ్నాస్ట్?
Sakshi Education
స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్... అమెరికాలోని టెక్సాస్ లో జూన్ 7న జరిగిన అమెరికా జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏడోసారి ఆల్ అరౌండ్ చాంపియన్‌గా (119.650 పాయింట్లు) నిలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది.
గతంలో క్లారా స్కార్త్ ఆరుసార్లు విజేతగా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సిమోన్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఐదు పతకాలు నెగ్గింది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ సిమోన్ స్వర్ణం సాధిస్తే... 1960 తర్వాత (లారిసా) వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో ఆల్ అరౌండ్ విభాగంలో పసిడి పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏడోసారి ఆల్ అరౌండ్ చాంపియన్‌గా జిమ్నాస్ట్?
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్
ఎక్కడ: టెక్సాస్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏడోసారి ఆల్ అరౌండ్ చాంపియన్‌గా జిమ్నాస్ట్?
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్
ఎక్కడ: టెక్సాస్, అమెరికా
Published date : 08 Jun 2021 06:57PM