Skip to main content

జీఎస్‌కే, సనోఫీపేశ్చర్‌లతో యూఎస్ ఒప్పందం

కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Current Affairs ఇందులో భాగంగా వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్‌ ట్రయల్స్, ఉత్పత్తి, సరఫరా కోసం 2.1 బిలియన్ డాలర్లు(రూ.15,725 కోట్లు) వెచ్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థలు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే), సనోఫీపేశ్చర్‌లతో ఒప్పందం చేసుకుంది. జీఎస్‌కే(బ్రిటన్), సనోఫీ(ఫ్రాన్స్) సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 2020 ఏడాది చివరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికాకు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామని జీఎస్‌కే, సనోఫీ ప్రకటించాయి.

తొలి శునకం మృతి..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ బారినపడ్డ మొదటి శునకం ‘బడ్డీ’ జూలై 31న మృతి చెందింది. జర్మన్షెఫర్డ్‌ డాగ్‌ అయిన బడ్డీకి 2020, జూన్ లో కరోనా సోకింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫార్మా సంస్థలు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే), సనోఫీపేశ్చర్‌లతో ఒప్పందం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎందుకు : కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని
Published date : 02 Aug 2020 10:37AM

Photo Stories