జీఎంఆర్‌కు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు
Sakshi Education
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను జీఎంఆర్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సంస్థకు అప్పగిస్తూ మార్చి 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీఎంఆర్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు(ఎల్‌వోఏ) జారీ చేయాలని రాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్)ను ఆదేశించింది.
జూన్ 30 వరకు టోర్నీలు రద్దు: ఐటీటీఎఫ్
కరోనా కల్లోలానికి వాయిదా లేదా రద్దవుతోన్న క్రీడల జాబితాలో తాజాగా టేబుల్ టెన్నిస్ (టీటీ) కూడా చేరింది. కరోనా ప్రభావంతో జూన్ 30 వరకు జరగాల్సిన అన్ని అంతర్జాతీయ ఈవెంట్‌లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మార్చి 30న ప్రకటించింది. అంతేకాకుండా ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో జూన్ 30 వరకు ఎలాంటి మార్పులు చేయరాదని, మార్చి నెలలో ఉన్న ర్యాంక్‌లనే కొనసాగించాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఎంఆర్‌కు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 31 Mar 2020 06:47PM