జాతీయ యువజన దినోత్సవం
Sakshi Education
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న కోల్‌కతాలో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం బేళూరు మఠంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వివాదాస్పదం కావడం వల్లే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, పాకిస్తాన్‌లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన హింస అన్ని దేశాలకు తెలిసి వచ్చిందన్నారు. పాకిస్తాన్ 70 ఏళ్లుగా తమ దేశం లో మైనార్టీలపై సాగిస్తున్న హింసాకాండకు ఆ దేశమే సమాధానమివ్వాలని అన్నారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని తీసుకోదని, ఆ చట్టం పౌరసత్వాన్ని ఇస్తుందని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ యువజన దినోత్సవం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బేళూరు మఠం, రామకృష్ణ మిషన్, కోల్‌కతా
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ యువజన దినోత్సవం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బేళూరు మఠం, రామకృష్ణ మిషన్, కోల్‌కతా
మాదిరి ప్రశ్నలు
1. క్రింది వాటిలో స్వామి వివేకానంద పూర్వ నామం?
1. విశ్వనాథ శర్మ
2. దామోదర్ దాస్
3. నరేంద్ర నాథ్ దత్తా
4. స్మామి సదానంద
- View Answer
- సమాధానం : 3
2. క్రింది వాటిలో స్వామి వివేకానంద సాహిత్య రచన కానిది?
1. రాజయోగ
2. కర్మయోగ
3. భక్తియోగ
4. సత్యయోగ
- View Answer
- సమాధానం : 4
Published date : 13 Jan 2020 05:57PM