ఇండియన్ అథ్లెటిక్స్ మీట్‌లో సరికొత్త రికార్డు
Sakshi Education
ఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మీట్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్లోని పాటియాలాలో మార్చి 5న జరిగిన ఈవెంట్‌లో ఈటెను నీరజ్ చోప్రా 88.07 మీటర్ల దూరం విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 88.06 మీటర్లతో (2018 ఆసియా క్రీడల్లో) తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును నీరజ్ చోప్రా సవరించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జావెలిన్ త్రోలో కొత్త జాతీయ రికార్డు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా
ఎక్కడ : పాటియాలా, పంజాబ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జావెలిన్ త్రోలో కొత్త జాతీయ రికార్డు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా
ఎక్కడ : పాటియాలా, పంజాబ్
Published date : 06 Mar 2021 06:47PM