హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తామని ప్రకటించిన పారిశ్రామిక వేత్త?
Sakshi Education
కృత్రిమమేధ సాయంతో మానవులను పోలిన (హ్యూమనాయిడ్) రోబో ‘టెస్లాబోట్’ను తయారుచేస్తామని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, టెస్లా మోటర్స్ సీఈవో ఎలన్‌మస్క్ ఆగస్టు 20న ప్రకటించారు.
వచ్చే ఏడాదికల్లా టెస్లాబోట్ ప్రాథమిక మోడల్ సిద్ధమవుతుందని ఎలన్ మస్క్ తెలిపారు. టెస్లాబోట్ మనుషుల కోసం నిర్మించిన ప్రపంచంలోనే తిరుగుతూ.. ప్రమాదకరమైన, పదేపదే చేసే బోరింగ్ పనుల(సాధారణమైన పనులు)ను చక్కబెడుతుందని పేర్కొన్నారు.
టెస్లా కార్లలో ఉపయోగిస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికతను, విద్యుత్‌తోపాటు రసాయనాలతో పనిచేసే దాదాపు 40 అక్చువేటర్లను టెస్లాబోట్‌లో ఉపయోగించనున్నారు. దీనితో ఇది తన పరిసరాలను అర్థం చేసుకోవడం, అడ్డంకులను అధిగమిస్తూ.. నడవడం చేయగలదు. ఇప్పటివరకు మనిషిలా మేధస్సుతో వ్యవహరించగల రోబోలు తయారు కాలేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న బోస్టన్ డైనమిక్స్ సంస్థ అన్ని అవరోధాలను తట్టు్టకుని నడవగల, గెంతగల రోబోలను తయారుచేసి పరీక్షిస్తోంది. తాజా హ్యూమనాయిడ్ రోబోను తయారుచేస్తామని మస్క్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హ్యూమనాయిడ్ రోబో‘టెస్లాబోట్’ను తయారు చేస్తామని ప్రకటించిన పారిశ్రామిక వేత్త?
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, టెస్లా మోటర్స్ సీఈవో ఎలన్‌మస్క్
ఎందుకు : మనుషులు చేసే సాధారణమైన పనులు చేసేందుకు...

Published date : 21 Aug 2021 05:58PM