Skip to main content

హురూన్ రిచ్ లిస్ట్-2020 ప్రకారం దేశంలోనే మూడో ధనవంతుడు ఎవరు?

దేశంలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో ఏట తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
Current Affairs

సెప్టెంబర్ 28న విడుదలైన ‘హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020’లో ఈ విషయం వెల్లడైంది. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ సంస్థతో కలసి హరూన్ రూపొందించిన హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌లో 2020, ఆగస్ట్ 31 నాటికి రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన 828 మందిని చేర్చారు. ఈ నివేదిక ప్రకారం... ఉమ్మడిగా ఈ 828 మంది సంపద 2020 ఏడాది 20 శాతం పెరిగింది.

హురూన్ ఇండియా రిచ్ లిస్ట్-ముఖ్యాంశాలు

  • 2020 ఏడాది అంబానీ సంపద 73 శాతం పెరిగి రూ.6.58 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచంలోనే మొదటి ఐదుగురు ధనవంతుల్లో ముకేశ్ నిలిచారు.
  • హిందుజా సోదరులు రూ.1.43 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.
  • హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్‌నాడార్, ఆయన కుటుంబం సంపద 34 శాతం పెరిగి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు.
  • అదానీ గ్రూపు సారథి గౌతం అదానీ సంపద ఈ ఏడాది 48 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరింది. రెండు స్థానాలు ఎగబాకి అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో నాలుగో స్థానానికి చేరారు.
  • రూ.1.14 లక్షల కోట్లతో విప్రో అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి జారిపోయారు.
  • సిరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా సంపద 6 శాతం పెరిగి రూ.94,300 కోట్లకు చేరుకోవడంతో ఆయన 6వ స్థానంలో నిలిచారు.
  • డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం సంపద 56 శాతం పెరగడంతో టాప్ 10లోకి చేరారు. వారి సంపద రూ.87,200 కోట్లకు చేరింది.
  • కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రమోటర్ ఉదయ్ కోటక్ సంపద 8 శాతం తగ్గి రూ.87,000 కోట్లుగా ఉండడంతో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు.
  • కెమికల్స్, పెట్రో కెమికల్స్ నుంచి 20 మంది, సాఫ్ట్‌వేర్ రంగం నుంచి 15 మంది కొత్తగా జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మొత్తం మీద ఫార్మా పరిశ్రమ నుంచి 122 మంది, కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాలకు సంబంధించి 55 మంది, సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ నుంచి 50 మందికి చోటు లభించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : హురూన్ ఇండియా రిచ్ లిస్ట్-2020 ప్రకారం మూడో ధనవంతుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్‌నాడార్
ఎక్కడ : భారత్
Published date : 01 Oct 2020 12:32PM

Photo Stories