Skip to main content

హాస్పిటల్‌గా యూఎస్‌ ఓపెన్‌ ఎరీనా

ప్రతియేటా ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు వేదికయ్యే యూఎస్‌ ఓపెన్‌ ఎరీనా ఇప్పుడు కరోనా ఆసుపత్రిగా మారనుంది.
Current Affairs

అమెరికాలో 2 లక్షలకు పైగానే కరోనా బారిన పడ్డారు. దీంతో న్యూయార్క్‌ సిటీలోని యూఎస్‌ ఓపెన్‌ స్టేడియం ఇండోర్‌ సౌకర్యాలను 350 పడకల హాస్పిటల్‌గా మార్చాలని అక్కడి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌ నిర్ణయించింది. లూయిస్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ స్టేడియాన్ని పాకశాలగా మార్చనున్నారు. ఇందులో రోజూ డాక్టర్లు, ఇతర సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 25 వేల మందికి భోజనాలు పెడతారు.


విదేశాల్లోనూ టీకాను పరీక్షిస్తాం: చైనా

కరోనాను నిర్మూలించే టీకాను రూపొందించే పనిలో ఉన్న చైనా.. ఆ వ్యాక్సిన్‌ను కరోనా తీవ్ర ప్రభావం చూపిన దేశాల్లోనూ పరీక్షించాలనుకుంటోంది. వుహాన్‌లో నిర్వహిస్తున్న పరీక్షల్లో ఆ టీకా సురక్షితమేనని, ప్రభావవంతమేనని తేలితే విదేశాల్లోనూ ట్రయల్స్‌ నిర్వహించే అవకాశముందని చైనీస్‌ అకాడెమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చెన్‌ వీ వెల్లడించారు. టీకా ప్రాథమిక స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ మార్చి 16న వుహాన్‌లో ప్రారంభమయ్యాయన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హాస్పిటల్‌గా యూఎస్‌ ఓపెన్‌ ఎరీనా
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : అమెరికా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌
ఎక్కడ : న్యూయార్క్‌ సిటీ, అమెరికా
ఎందుకు : కోవిడ్-19 కార‌ణంగా

Published date : 02 Apr 2020 12:24PM

Photo Stories